Articles by "National News"

Showing posts with label National News. Show all posts

 

  • బీహార్‌లో దారి మధ్యలో చెట్లను ఉంచి రోడ్డేసిన అధికారులు
  • రూ.100 కోట్లతో 7.48 కిలోమీటర్ల పట్నా- గయా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు 
  • జహానాబాద్ వద్ద రోడ్డు మధ్యలో చెట్లు రావడంతో, వాటిని తొలగించేందుకు అటవీశాఖను అనుమతి కోరిన అధికారులు
  • చెట్ల తొలగింపుకు నిరాకరించి, దీనికి ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా డిమాండ్ చేసిన అటవీశాఖ 
  • దీంతో చెట్ల చుట్టూ రోడ్డు వేసుకుంటూ వెళ్లిన జిల్లా యంత్రాంగం
Bihar’s Rs 100 crore highway project leaves trees standing tall in middle of road

 
  • శివకాశి బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు 
  • ముగ్గురు మృతి, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
  • తమిళనాడు శివకాశి సత్తూరు సమీపంలోని బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించడంతో, ముగ్గురు కార్మికులు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ఏడుగురు కార్మికులు 
  • మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Massive Explosion at Sivakasi Firecracker Godown, Three Dead, Seven Others Seriously Injured, Following a massive explosion at a firecracker godown near Sattur in Sivakasi, Tamil Nadu, three workers lost their lives, while seven others sustained serious injuries, Firefighting personnel are extinguishing the flames.


"Threw Chilli In Eyes, Put Foot On His Neck": Karnataka Woman Kills Husband
  • భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య 
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య 
  • కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు
  • అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి
  • అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన సుమంగళి
  • ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి, భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
  • ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కారంపొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించి భార్యను విచారించిన పోలీసులు
  • తానే హత్య చేశానని విచారణలో అగీకరించడంతో, భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • ఇరాన్ క్షిపణి దాడి.. ఖ‌తార్‌లోని భారతీయుల‌కు అల‌ర్ట్‌...
  • ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి
  • అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని వెల్లడి
  • ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబ‌సీ సూచన
  • ఖతార్ గగనతలం, భూభాగం సురక్షితమేనని అక్కడి రక్షణ శాఖ భరోసా
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ సోమవారం క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే, ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు. వారాంతంలో తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడున్న భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది.

సోమవారం జరిగిన ఈ ఘటన అనంతరం, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా స్పందించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయ సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. స్థానిక వార్తలు, ఖతార్ అధికారులు అందించే సూచనలు, మార్గదర్శకాలను పాటించండి. రాయబార కార్యాలయం మా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కూడా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది" అని భారతీయులకు ఎంబ‌సీ విజ్ఞప్తి చేసింది. ఈ దాడుల వల్ల ఖతార్‌లో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించింది. పౌరులు, నివాసితులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని, సూచనలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, ఈ దాడులకు పాల్పడటానికి ముందే రెండు దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు ఇరాన్ సమాచారం అందజేసిందని ఓ సీనియర్ ప్రాంతీయ అధికారి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ పరిణామం ప్రాంతీయంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఖతార్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.

  • మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు అంటూ అవమానిస్తూ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
  • ఉత్తర తెలంగాణ పేరు సైతం ప్రస్తావన
  • ఇండియాల రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
  • గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకూడదని.. ఆ దేశ ఉద్యోగులకు సూచన
  • భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ 
  • లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల 
  • నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
  • భారతదేశంలో మానభంగాలు చాలా వేగంగా పెరుగుతున్న నేరంగా మారిందని.. కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి తెలిపిన అమెరికా
  • ఒంటరిగా ప్రయాణించకూడదని, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని స్పష్టం 
  • భారత్‌లో పని చేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసింది గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది
  • అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాలను చేర్చిన అమెరికా
  • జమ్మూ-కశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే ఫరవాలేదని, గ్రామీణ ప్రాంతాలకు వద్దని పేర్కొన్న అమెరికా

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.