Articles by "Revanth Reddy"

Showing posts with label Revanth Reddy. Show all posts

 

పాశమైలారం ఘటన.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

సిగాచీ పేలుడు (Sigachi Blast) బాధిత కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.. అంతే కాకుండా బాధిత కుటుంబ స‌భ్యుల పిల్ల‌ల‌కు అయ్యే విద్యాభ్యాసం (Education) ఖ‌ర్చు తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ఒక్కొక్క‌రికి రూ . కోటి (One Crore) ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడి వివిధ హాస్పిటల్లో చికిత్స (Treatment) పొందుతున్న కార్మికులను (Labour) రేవంత్ నేడు పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు..

వైద్యుల నుంచి అందుతున్న చికిత్స వివరాలను అడిగారు. క్షతగాత్రలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి రేవంత్ సమాచారాన్ని సేకరించారు.. ఈ సందర్భంగా రేవంత్ క్షతగాత్రుల బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ గే తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.10 ల‌క్ష‌లు, స్వ‌ల్ప గాయ‌ప‌డిన వారికి రూ .2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. చికిత్ప పొందుతున్న వారి వైద్య ఖ‌ర్చుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని తెలిపారు.. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇటువంటి ఘోర దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని రేవంత్ అన్నారు.. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న అని పేర్కొన్నారు..

 

  • ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు రద్దు.. అయోమయంలో లబ్ధిదారులు
  • ముందే చెబితే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదంటూ ఆగ్రహం 
  • రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
  • ఉన్న ఇల్లు కూల్చుకోని, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన తరువాత ఇల్లు రద్దు చేయడంతో అయోమయంలో లబ్ధిదారులు
  • 20 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకున్నారని కొన్ని, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని మరికొన్ని ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
  • కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మారం లక్ష్మీ- బుచ్చయ్య దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడంతో, తమకున్న రేకుల షెడ్డుని కూల్చి, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన దంపతుల
  • నిర్మాణ పనులు జరుగుతుండగా కార్యదర్శి వచ్చి, మీరు గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం డబ్బులు, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని, ఇప్పుడు బిల్లులు రావని తెలపడంతో విస్తుపోయిన లబ్ధిదారులు
  • కేవలం వీణవంకలోనే 36 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వగా, 11 మందికి బిల్లులు రావని చెప్పారని, ముందే చెప్పి ఉంటే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
  • ఎప్పుడో 20 ఏళ్ల కింద సిమెంట్ బస్తాలు తీసుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయడం ఏంటని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ బ్రతుకులు రోడ్డు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
indiramma houses, indiramma houses new rules, revanth reddy indiramma houses, indiramma houses new rules & guidelines, telangana indiramma house scheme eligibility, indiramma houses how to check, telangana indiramma house scheme, indiramma house scheme, indiramma illu house design, indiramma house sanction list 2025, indiramma house details, indramma houses, indiramma house 2025, indiramma house scheme by revanth reddy, new twist in telangana indiramma house scheme, indiramma house hindi news, indiramma houses scam, indiramma houses, indiramma houses rules, indiramma houses scheme, indiramma houses new rules, revanth reddy indiramma houses, revanth on indiramma houses, indiramma scheme houses, indiramma houses new rules & guidelines, indiramma house, indiramma house scheme, indiramma house cancellation notice, revanth reddy decision on indiramma houses, cid submitts report on indiramma houses scam, telangana indiramma house scheme, indiramma house telangana, telangana indiramma house

 

  • పంట బీమా పథకానికి ఎగనామం పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 
  • వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు గడుస్తున్నా, పంట బీమా కోసం టెండర్లు పిలవని ప్రభుత్వం
  • బడ్జెట్ లో రూ.1,300 కోట్లు కేటాయించినా, ఆర్థిక పరిస్థితి బాగాలేదని విపత్తు వచ్చినప్పుడు నష్ట పరిహారం చెల్లించడం మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం
  • రాష్ట్రంలో వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు దాటుతున్నా, పంట బీమా టెండర్లు పిలవని రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి బీమా లేనట్టే అని చర్చించుకుంటున్న రైతులు
  • పంట బీమా కోసం రెండు పంటలకు రూ.2,600 ఖర్చు అవుతుందని, ఇప్పుడు ఆ పథకానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం 
  • పంట బీమా వల్ల రైతులకంటే బీమా కంపెనీలే ఎక్కువ లాభ పడుతున్నారని, విపత్తు జరిగినప్పుడు పంట నష్టం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం మంచిదని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం





ఏపీలోని తాడెపల్లిగూడెం ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణకు రూ.1,570 కోట్లు

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పైసా ఇవ్వని మోదీ సర్కార్‌

రాష్ట్ర ప్రభుత్వంపైనే రూ. 205 కోట్ల భూ సేకరణ భారం


రామగుండం, నిజామాబాద్‍, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టులకూ నో హెల్ప్‌

వరంగల్‍,  ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయంలో ఏపీపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న కేంద్రం.. తెలంగాణను మాత్రం ఎట్టికి వదిలేస్తోంది. తెలంగాణ మొత్తంలో హైదరాబాద్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్‌ ఉండగా.. ఇటీవలే వరంగల్‌లోని మామునూరు, రామగుండంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఏపీలో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి వందల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని ఎయిర్‌పోర్టులకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. పైగా భూసేకరణ ఖర్చును సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది.


*_ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టుకు రూ.1,570 కోట్లు_*


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉండగా... కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రి దేశీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉడాన్‌ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


దీనికి సంబంధించి ఉంగుటూరు మండలంలో 1,123 ఎకరాల అటవీ భూములను గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ.. ఈ భూములను ఎయిర్‌పోర్ట్‌కు ఇవ్వాలంటే అందుకు రెట్టింపు భూములను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దానికి అవసరమైన భూసేకరణ ఖర్చును సైతం తామే భరిస్తోంది. ఇందుకోసం మోదీ సర్కార్‍ ఏకంగా రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని అక్కడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మంగళవారం వెల్లడించారు.


*_మామునూరులో 253 ఎకరాలకు నో ఫండ్స్‌_*


తెలంగాణలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించేందుకు సుమారు 20 ఏండ్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్‌పోర్ట్‌ ఉండకూడదని జీఎంఆర్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. మరో వైపు 45 ఏండ్ల కిందే మామునూరు ఎయిర్‌పోర్టు మూతపడడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ పునఃప్రారంభానికి 949.14 ఎకరాలు అవసరం అవుతాయని తేల్చగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి.


మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వ భూములు పోను ఫైనల్‍గా 220 ఎకరాల సాగు భూమి, మరో 33 ఎకరాల వరకు ప్లాట్లతో కలిపి మొత్తం 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‍ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ క్లియర్‌ చేసింది. ఇదే టైంలో భూసేకరణ విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరగాలంటే అందుకు అవసరమైన 253 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఎయిర్‍పోర్ట్‌ అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఈ)కు అప్పగించాలని చెప్పింది.


దీంతో భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్‍ 17న కాంగ్రెస్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 220 ఎకరాలకు సంబంధించిన 309 మంది రైతులు, 61,134.5 గజాల కమర్షియల్‍ ప్లాట్లకు సంబంధించిన 50 మంది ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.205 కోట్లే కాకుండా మరో రూ.200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది.


*_తెలంగాణపై కేంద్రం వివక్ష_*


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఎయిర్‍పోర్టుల నిర్మాణంపై వివక్షచూపుతోంది. విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్న కేంద్రం.. అందుకు అవసరమైన, భారీ బడ్జెట్‌తో కూడుకున్న భూసేకరణ ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే రుద్దుతోంది. ఏపీలో ఇప్పుడున్న ఏడు ఎయిర్‍పోర్టులను 14కు పెంచుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాడేపల్లిగూడెం విమానాశ్రయానికి అవసరమయ్యే భూసేకరణకు రూ.1,570 కోట్లు భరించిన కేంద్రం.. వినుగొండ, దగదర్తి, ఓర్వకల్లు, కుప్పంతో పాటు భోగాపురంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించేందుకు రెడీగా ఉంది.


కానీ తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత మామునూరులో నిర్మించబోయే ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల భూసేకరణకు నయా పైసా కేటాయించడం లేదు. అయితే ఏపీకి చెందిన ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు మోదీ మంత్రివర్గంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్లే ఆ రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులిస్తూ.. తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించి ఎయిర్‍పోర్ట్‌ భూ సేకరణ నిధుల విషయంతో పాటు నిజామాబాద్‍, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌లకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

  • రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు మాత్రం రూ. 1.3 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం
  • ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులపై దృష్టిసారించిన హెచ్ఎండీఏ అధికారులు
  • ఇక్కడి కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున అసహనం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్దీం
  • తో దాదాపు రూ.1.3 కోట్ల వ్యయంతో ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్న అధికారులు
  • త్వరలో కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది.. దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్తవి వేయనున్న అధికారులు
  • ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.