Articles by "Telugu News"

Showing posts with label Telugu News. Show all posts

 
  • Actor Kota Srinivasa Rao Passes Away at 83
  • ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత 
  • ఈరోజు తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన కోటా శ్రీనివాసరావు(83)
actor kota srinivasa rao passes away, veteran actor kota srinivasa rao passes away, actor kota srinivasa rao passed away, telugu actor kota srinivasa rao passed away, veteran actor kota srinivasa rao passed away, legendary actor kota srinivasa rao passed away, kota srinivasa rao passes away, kota srinivasa rao passes away big tv, kota srinivasa rao passed away, kota srinivas rao passed away, actor kota srinivasa rao, actor kota srinivasa rao rip, senior actor kota srinivasa rao, kota srinivasa rao away

 
  • రచయిత, సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా మృతి
  • మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూత
  • బాహుబలి, ఎన్టీఆర్: కథానాయకుడు, ఆర్ఆర్ఆర్, హనుమాన్, సై, ఛత్రపతి, రాజన్న తదితర సినిమాల్లో కొన్ని పాటలకు లిరిక్స్ రాసిన దత్తా


 Ramagundam Police Commissionerate | రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్

నైపుణ్యం, సామర్ధ్యం, ప్రతిభ గుర్తించడానికే పోలీస్ డ్యూటీ మీట్

నేరా దర్యాప్తు లో మరింత శాస్త్రీయ త: పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

 
పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు 'పోలీసు డ్యూటీ మీట్' నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ జూలై నెలలో వరంగల్ లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల్ జోన్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. 




                   
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ.... విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత సాధించే దిశగా అవ గాహన కల్పించారు. సీపీ మాట్లాడుతూ, - క్షేత్రస్థాయిలో నేర విచారణకు ఎదురయ్యే అంశాలకు సంబంధించి విధులపై ప్రదర్శన చేయడం ద్వారా మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని  ఈరోజు కాళేశ్వరం జోన్ పరిధిలోని అధికారులకు మరియు సిబ్బంది కి 1. సైంటిఫిక్ అయిడ్స్ టూ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లో ఫారెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్ ఓరల్ టెస్ట్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్ బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్, పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్ 2.యాంటి సబాటేజ్ చెక్ ఈవెంట్ లో వెహికల్ సెర్చ్, గ్రౌండ్ సర్చ్, రూమ్ సెర్చ్, యాక్సిస్ కంట్రోల్, 3. కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్ లో కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ, 4. డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ ఈవెంట్ లో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ , నార్కోటిక్స్, సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్  ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెలలో వరంగల్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. 

📌 సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు  అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, సంక్లిష్టమైన  కేసులు పరిష్కరించడానికి, ఆలోచనలను మార్పిడి పోలీసుల చేసుకోవడానికి, వృత్తిపరమైన పనితీరు యొక్క సామర్థ్యం మరియు మెరుగుదలకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రా, జాతీయ స్ధాయిలో జరిగే  పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సహం లభిస్తుందని అన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని ఇక్కడ ఎంపికై కాలేశ్వరం జోన్ తరపున మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు

 ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏ ఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ ఐ లు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ లు, కమీషనరేట్  పరిధి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా ల పోలీసు అధికారులు, సిబ్బంది, బీడి టీం, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Ramagundam Police Commissionerate హోంగార్డులకు రెయిన్‌ కోట్ల పంపిణీ

వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు రెయిన్‌ కోట్లను హోంగార్డ్స్‌ కు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పంపిణీ చేశారు. 

సీపీ గారు మాట్లాడుతూ...పోలీసు వ్యవస్థలో హోంగార్డు అధికారులు ప్రజల రక్షణ కోసం సమర్థవంతంగా విధులు నిర్వహణ కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. వర్షకాలం సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రిపూట విధుల్లో మరియు బందోబస్తు వంటి విధులను హోంగార్డులు కొనసాగించడానికి  రెయిన్ కోట్స్ సహాయపడుతాయి అని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ హోం గార్డ్స్ కు రెయిన్ కోట్స్ అందరికి రెండు రోజులలో అందించడం జరుగుతుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ఐ హోం గార్డ్స్ వామన మూర్తి, హోం గార్డ్స్ పాల్గొన్నారు.

 

పాశమైలారం ఘటన.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

సిగాచీ పేలుడు (Sigachi Blast) బాధిత కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.. అంతే కాకుండా బాధిత కుటుంబ స‌భ్యుల పిల్ల‌ల‌కు అయ్యే విద్యాభ్యాసం (Education) ఖ‌ర్చు తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ఒక్కొక్క‌రికి రూ . కోటి (One Crore) ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడి వివిధ హాస్పిటల్లో చికిత్స (Treatment) పొందుతున్న కార్మికులను (Labour) రేవంత్ నేడు పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు..

వైద్యుల నుంచి అందుతున్న చికిత్స వివరాలను అడిగారు. క్షతగాత్రలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి రేవంత్ సమాచారాన్ని సేకరించారు.. ఈ సందర్భంగా రేవంత్ క్షతగాత్రుల బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ గే తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.10 ల‌క్ష‌లు, స్వ‌ల్ప గాయ‌ప‌డిన వారికి రూ .2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. చికిత్ప పొందుతున్న వారి వైద్య ఖ‌ర్చుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని తెలిపారు.. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇటువంటి ఘోర దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని రేవంత్ అన్నారు.. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న అని పేర్కొన్నారు..

 

  • రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు 
  • తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారు 
  • పార్టీకోసం కష్టపడిన వాడిగా నా కళ్ళముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశాను
  • అణచివేతను భరించే శక్తి ఇక నాకు లేదు - గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
Telangana MLA T Raja Singh Quits BJP

 

  • పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు
  • అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలు తొలగిస్తున్న అధికారులు
  • శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉండే అవకాశం
  • ఇప్పటివరకు 37 మంది మృతి చెందినట్లు తెలిపిన అధికారులు
  • ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు.. గుర్తుపట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు
  • మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు

pashamylaram reactor blast, pashamylaram reactor blast site, reactor blast in pashamylaram, sangareddy pashamylaram blast cause, sigachi pharma reactor blast, sigachi reactor blast, pashamylaram pharma reactor blast latest update, reactor blast dna testing in sangareddy, sigachi factory reactor blast, reactor blast in hyderabad | sigachi chemicals, cm revanth reddy about pashamylaram blast, sangareddy factory blast, chemical factory blast in pashamylaram, blast in sangareddy factory, pashamylaram blast

  • అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలి
  • అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించిన సయ్యద్ రహీమున్నీసా మరో ఏడుగురు వ్యక్తులు
  • ఈ పిటిషన్‌పై విచారణ చేస్తూ, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై  ప్రదర్శించాలని వ్యాఖ్యానించిన జస్టిస్ విజయసాయిరెడ్డి
  • అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతుంది. టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అది శాంతిభద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం
  • వచ్చే వాయిదా లోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు

 

  • ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు రద్దు.. అయోమయంలో లబ్ధిదారులు
  • ముందే చెబితే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదంటూ ఆగ్రహం 
  • రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
  • ఉన్న ఇల్లు కూల్చుకోని, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన తరువాత ఇల్లు రద్దు చేయడంతో అయోమయంలో లబ్ధిదారులు
  • 20 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకున్నారని కొన్ని, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని మరికొన్ని ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
  • కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మారం లక్ష్మీ- బుచ్చయ్య దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడంతో, తమకున్న రేకుల షెడ్డుని కూల్చి, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన దంపతుల
  • నిర్మాణ పనులు జరుగుతుండగా కార్యదర్శి వచ్చి, మీరు గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం డబ్బులు, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని, ఇప్పుడు బిల్లులు రావని తెలపడంతో విస్తుపోయిన లబ్ధిదారులు
  • కేవలం వీణవంకలోనే 36 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వగా, 11 మందికి బిల్లులు రావని చెప్పారని, ముందే చెప్పి ఉంటే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
  • ఎప్పుడో 20 ఏళ్ల కింద సిమెంట్ బస్తాలు తీసుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయడం ఏంటని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ బ్రతుకులు రోడ్డు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
indiramma houses, indiramma houses new rules, revanth reddy indiramma houses, indiramma houses new rules & guidelines, telangana indiramma house scheme eligibility, indiramma houses how to check, telangana indiramma house scheme, indiramma house scheme, indiramma illu house design, indiramma house sanction list 2025, indiramma house details, indramma houses, indiramma house 2025, indiramma house scheme by revanth reddy, new twist in telangana indiramma house scheme, indiramma house hindi news, indiramma houses scam, indiramma houses, indiramma houses rules, indiramma houses scheme, indiramma houses new rules, revanth reddy indiramma houses, revanth on indiramma houses, indiramma scheme houses, indiramma houses new rules & guidelines, indiramma house, indiramma house scheme, indiramma house cancellation notice, revanth reddy decision on indiramma houses, cid submitts report on indiramma houses scam, telangana indiramma house scheme, indiramma house telangana, telangana indiramma house

 

  • పంట బీమా పథకానికి ఎగనామం పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 
  • వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు గడుస్తున్నా, పంట బీమా కోసం టెండర్లు పిలవని ప్రభుత్వం
  • బడ్జెట్ లో రూ.1,300 కోట్లు కేటాయించినా, ఆర్థిక పరిస్థితి బాగాలేదని విపత్తు వచ్చినప్పుడు నష్ట పరిహారం చెల్లించడం మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం
  • రాష్ట్రంలో వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు దాటుతున్నా, పంట బీమా టెండర్లు పిలవని రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి బీమా లేనట్టే అని చర్చించుకుంటున్న రైతులు
  • పంట బీమా కోసం రెండు పంటలకు రూ.2,600 ఖర్చు అవుతుందని, ఇప్పుడు ఆ పథకానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం 
  • పంట బీమా వల్ల రైతులకంటే బీమా కంపెనీలే ఎక్కువ లాభ పడుతున్నారని, విపత్తు జరిగినప్పుడు పంట నష్టం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం మంచిదని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం


Telangana pharma Sigachi factory blast, Death toll climbs to 37, rescue ops continue, Sigachi Industries in focus

  • సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 37కి చేరిన మృతుల సంఖ్య
  • మరో 35 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
  • లభించని 27 మంది ఆచూకీ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్


గురుకుల బాలికల హాస్టల్లో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య 

హనుమకొండ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లిలోని ప్రభుత్వ గురుకుల బాలికల హాస్టల్లో, బాత్ రూములో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఏకు శ్రావణి(15) అనే 10వ తరగతి విద్యార్థిని

Student Commits Suicide by Hanging in Gurukul Girls' Hostel

In the government Gurukul Girls' Hostel located in Narsakkapalli, Parakala Mandal, Hanumakonda District, a 10th-grade student named Eku Shravani (15) took her life by hanging herself with a chunni in the bathroom.

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కి క్యాట్ శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి తిరిగి మళ్లీ తెలంగాణకు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..

ఏడాది క్రితం ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆమ్రపాలి కాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ పనిచేశారు.




ఏపీలోని తాడెపల్లిగూడెం ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణకు రూ.1,570 కోట్లు

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పైసా ఇవ్వని మోదీ సర్కార్‌

రాష్ట్ర ప్రభుత్వంపైనే రూ. 205 కోట్ల భూ సేకరణ భారం


రామగుండం, నిజామాబాద్‍, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టులకూ నో హెల్ప్‌

వరంగల్‍,  ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయంలో ఏపీపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న కేంద్రం.. తెలంగాణను మాత్రం ఎట్టికి వదిలేస్తోంది. తెలంగాణ మొత్తంలో హైదరాబాద్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్‌ ఉండగా.. ఇటీవలే వరంగల్‌లోని మామునూరు, రామగుండంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఏపీలో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి వందల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని ఎయిర్‌పోర్టులకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. పైగా భూసేకరణ ఖర్చును సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది.


*_ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టుకు రూ.1,570 కోట్లు_*


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉండగా... కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రి దేశీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉడాన్‌ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


దీనికి సంబంధించి ఉంగుటూరు మండలంలో 1,123 ఎకరాల అటవీ భూములను గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ.. ఈ భూములను ఎయిర్‌పోర్ట్‌కు ఇవ్వాలంటే అందుకు రెట్టింపు భూములను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దానికి అవసరమైన భూసేకరణ ఖర్చును సైతం తామే భరిస్తోంది. ఇందుకోసం మోదీ సర్కార్‍ ఏకంగా రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని అక్కడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మంగళవారం వెల్లడించారు.


*_మామునూరులో 253 ఎకరాలకు నో ఫండ్స్‌_*


తెలంగాణలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించేందుకు సుమారు 20 ఏండ్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్‌పోర్ట్‌ ఉండకూడదని జీఎంఆర్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. మరో వైపు 45 ఏండ్ల కిందే మామునూరు ఎయిర్‌పోర్టు మూతపడడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ పునఃప్రారంభానికి 949.14 ఎకరాలు అవసరం అవుతాయని తేల్చగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి.


మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వ భూములు పోను ఫైనల్‍గా 220 ఎకరాల సాగు భూమి, మరో 33 ఎకరాల వరకు ప్లాట్లతో కలిపి మొత్తం 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‍ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ క్లియర్‌ చేసింది. ఇదే టైంలో భూసేకరణ విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరగాలంటే అందుకు అవసరమైన 253 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఎయిర్‍పోర్ట్‌ అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఈ)కు అప్పగించాలని చెప్పింది.


దీంతో భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్‍ 17న కాంగ్రెస్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 220 ఎకరాలకు సంబంధించిన 309 మంది రైతులు, 61,134.5 గజాల కమర్షియల్‍ ప్లాట్లకు సంబంధించిన 50 మంది ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.205 కోట్లే కాకుండా మరో రూ.200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది.


*_తెలంగాణపై కేంద్రం వివక్ష_*


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఎయిర్‍పోర్టుల నిర్మాణంపై వివక్షచూపుతోంది. విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్న కేంద్రం.. అందుకు అవసరమైన, భారీ బడ్జెట్‌తో కూడుకున్న భూసేకరణ ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే రుద్దుతోంది. ఏపీలో ఇప్పుడున్న ఏడు ఎయిర్‍పోర్టులను 14కు పెంచుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాడేపల్లిగూడెం విమానాశ్రయానికి అవసరమయ్యే భూసేకరణకు రూ.1,570 కోట్లు భరించిన కేంద్రం.. వినుగొండ, దగదర్తి, ఓర్వకల్లు, కుప్పంతో పాటు భోగాపురంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించేందుకు రెడీగా ఉంది.


కానీ తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత మామునూరులో నిర్మించబోయే ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల భూసేకరణకు నయా పైసా కేటాయించడం లేదు. అయితే ఏపీకి చెందిన ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు మోదీ మంత్రివర్గంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్లే ఆ రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులిస్తూ.. తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించి ఎయిర్‍పోర్ట్‌ భూ సేకరణ నిధుల విషయంతో పాటు నిజామాబాద్‍, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌లకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

 

  • మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
  • ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు
  • NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసిన కూతురు(16)
  • ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18)తో కలిసి హత్య చేసిన కన్న కూతురు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు

  • మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు అంటూ అవమానిస్తూ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
  • ఉత్తర తెలంగాణ పేరు సైతం ప్రస్తావన
  • ఇండియాల రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
  • గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకూడదని.. ఆ దేశ ఉద్యోగులకు సూచన
  • భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ 
  • లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల 
  • నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
  • భారతదేశంలో మానభంగాలు చాలా వేగంగా పెరుగుతున్న నేరంగా మారిందని.. కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి తెలిపిన అమెరికా
  • ఒంటరిగా ప్రయాణించకూడదని, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని స్పష్టం 
  • భారత్‌లో పని చేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసింది గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది
  • అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాలను చేర్చిన అమెరికా
  • జమ్మూ-కశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే ఫరవాలేదని, గ్రామీణ ప్రాంతాలకు వద్దని పేర్కొన్న అమెరికా

  • రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు మాత్రం రూ. 1.3 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం
  • ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులపై దృష్టిసారించిన హెచ్ఎండీఏ అధికారులు
  • ఇక్కడి కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున అసహనం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్దీం
  • తో దాదాపు రూ.1.3 కోట్ల వ్యయంతో ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్న అధికారులు
  • త్వరలో కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది.. దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్తవి వేయనున్న అధికారులు
  • ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు

 

  • ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం
  • చెన్నైలో జెప్టో యాప్‌లో ఆర్డర్‌ చేసిన మడిపాక్కంకు చెందిన ఐటీ ఉద్యోగిని
  • మహిళ ఆర్డర్‌ చేసిన వస్తువులను డెలివరీ చేసిన గోపినాథ్‌ అనే డెలివరీ బాయ్‌
  • సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ లేదని, కాసేపు చార్జింగ్‌ పెట్టాలని కోరడంతో డెలవరీబాయ్‌ని ఇంట్లోనికి అనుమతించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేసిన గోపినాథ్యు
  • వతి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పరారైన డెలివరీ బాయ్‌
  • దీంతో పోలీసులను అశ్రయించిన బాధిత మహిళ
  • కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్‌ గోపీనాథ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • విజయ్ దేవరకొండ పై ఎఫ్ఐఆర్ నమోదు
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు
  • రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యల నైపథ్యంలో నమోదు
  • 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు అంటూ విజయ్ దేవరకొండ వివాదస్పద వ్యాఖ్యలు
  • గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.