Ramagundam Police Commissionerate | రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్
నైపుణ్యం, సామర్ధ్యం, ప్రతిభ గుర్తించడానికే పోలీస్ డ్యూటీ మీట్
నేరా దర్యాప్తు లో మరింత శాస్త్రీయ త: పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,
పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు 'పోలీసు డ్యూటీ మీట్' నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ జూలై నెలలో వరంగల్ లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల్ జోన్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ.... విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత సాధించే దిశగా అవ గాహన కల్పించారు. సీపీ మాట్లాడుతూ, - క్షేత్రస్థాయిలో నేర విచారణకు ఎదురయ్యే అంశాలకు సంబంధించి విధులపై ప్రదర్శన చేయడం ద్వారా మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని ఈరోజు కాళేశ్వరం జోన్ పరిధిలోని అధికారులకు మరియు సిబ్బంది కి 1. సైంటిఫిక్ అయిడ్స్ టూ ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లో ఫారెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్ ఓరల్ టెస్ట్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్ బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్, క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్, పోలీస్ పోర్ట్రైట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటన్ టెస్ట్ 2.యాంటి సబాటేజ్ చెక్ ఈవెంట్ లో వెహికల్ సెర్చ్, గ్రౌండ్ సర్చ్, రూమ్ సెర్చ్, యాక్సిస్ కంట్రోల్, 3. కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్ లో కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీ, 4. డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్ ఈవెంట్ లో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ , నార్కోటిక్స్, సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెలలో వరంగల్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
📌 సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, సంక్లిష్టమైన కేసులు పరిష్కరించడానికి, ఆలోచనలను మార్పిడి పోలీసుల చేసుకోవడానికి, వృత్తిపరమైన పనితీరు యొక్క సామర్థ్యం మరియు మెరుగుదలకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రా, జాతీయ స్ధాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సహం లభిస్తుందని అన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని ఇక్కడ ఎంపికై కాలేశ్వరం జోన్ తరపున మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏ ఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ ఐ లు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ లు, కమీషనరేట్ పరిధి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా ల పోలీసు అధికారులు, సిబ్బంది, బీడి టీం, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment