Ramagundam Police Commissionerate హోంగార్డులకు రెయిన్ కోట్ల పంపిణీ
వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు రెయిన్ కోట్లను హోంగార్డ్స్ కు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పంపిణీ చేశారు.
సీపీ గారు మాట్లాడుతూ...పోలీసు వ్యవస్థలో హోంగార్డు అధికారులు ప్రజల రక్షణ కోసం సమర్థవంతంగా విధులు నిర్వహణ కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. వర్షకాలం సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రిపూట విధుల్లో మరియు బందోబస్తు వంటి విధులను హోంగార్డులు కొనసాగించడానికి రెయిన్ కోట్స్ సహాయపడుతాయి అని రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ హోం గార్డ్స్ కు రెయిన్ కోట్స్ అందరికి రెండు రోజులలో అందించడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ఐ హోం గార్డ్స్ వామన మూర్తి, హోం గార్డ్స్ పాల్గొన్నారు.
Post a Comment