పాశమైలారం ఘటన.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సిగాచీ పేలుడు (Sigachi Blast) బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.. అంతే కాకుండా బాధిత కుటుంబ సభ్యుల పిల్లలకు అయ్యే విద్యాభ్యాసం (Education) ఖర్చు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ . కోటి (One Crore) ఇవ్వనున్నట్లు ప్రకటించారు.. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడి వివిధ హాస్పిటల్లో చికిత్స (Treatment) పొందుతున్న కార్మికులను (Labour) రేవంత్ నేడు పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు..
వైద్యుల నుంచి అందుతున్న చికిత్స వివరాలను అడిగారు. క్షతగాత్రలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి రేవంత్ సమాచారాన్ని సేకరించారు.. ఈ సందర్భంగా రేవంత్ క్షతగాత్రుల బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ గే తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్ప గాయపడిన వారికి రూ .2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చికిత్ప పొందుతున్న వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.. తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి ఘోర దుర్ఘటన జరగలేదని రేవంత్ అన్నారు.. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొన్నారు..
Post a Comment