June 2025

"Threw Chilli In Eyes, Put Foot On His Neck": Karnataka Woman Kills Husband
  • భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య 
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య 
  • కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు
  • అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి
  • అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన సుమంగళి
  • ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి, భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
  • ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కారంపొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించి భార్యను విచారించిన పోలీసులు
  • తానే హత్య చేశానని విచారణలో అగీకరించడంతో, భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

  • ఇరాన్ క్షిపణి దాడి.. ఖ‌తార్‌లోని భారతీయుల‌కు అల‌ర్ట్‌...
  • ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి
  • అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని వెల్లడి
  • ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబ‌సీ సూచన
  • ఖతార్ గగనతలం, భూభాగం సురక్షితమేనని అక్కడి రక్షణ శాఖ భరోసా
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఖతార్‌లోని అల్ ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ సోమవారం క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే, ఈ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు. వారాంతంలో తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడున్న భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది.

సోమవారం జరిగిన ఈ ఘటన అనంతరం, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా స్పందించింది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయ సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. స్థానిక వార్తలు, ఖతార్ అధికారులు అందించే సూచనలు, మార్గదర్శకాలను పాటించండి. రాయబార కార్యాలయం మా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కూడా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది" అని భారతీయులకు ఎంబ‌సీ విజ్ఞప్తి చేసింది. ఈ దాడుల వల్ల ఖతార్‌లో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించింది. పౌరులు, నివాసితులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని, సూచనలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, ఈ దాడులకు పాల్పడటానికి ముందే రెండు దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు ఇరాన్ సమాచారం అందజేసిందని ఓ సీనియర్ ప్రాంతీయ అధికారి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ పరిణామం ప్రాంతీయంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఖతార్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కి క్యాట్ శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి తిరిగి మళ్లీ తెలంగాణకు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..

ఏడాది క్రితం ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఆమ్రపాలి కాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ పనిచేశారు.

ఆక్సియం-4 మిషన్ ఎందుకు వాయిదా పడింది?

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పాల్గొననున్న ఆక్సియం-4 మిషన్ వాయిదా పడింది. జూన్ 11న జరగాల్సిన ఈ మిషన్‌లో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ తలెత్తింది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జరగాల్సిన ప్రయాణం నిలిపివేశారు. ఇస్రో, స్పేస్‌ఎక్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. మే 29న కూడా మిషన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

 
  • AP Free Bus: ఏపీ మహిళలకు బంపరాఫర్ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం
  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అమలు చేస్తాం
  • అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. అని ఒక ప్రకటనలో తెలిపారు
  • మహిళలకు బస్సు ఫ్రీ అమలులుకి వస్తుందో రాదో ఆగష్టు 15 వారికి వేచి చూడాల్సిందే




ఏపీలోని తాడెపల్లిగూడెం ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణకు రూ.1,570 కోట్లు

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పైసా ఇవ్వని మోదీ సర్కార్‌

రాష్ట్ర ప్రభుత్వంపైనే రూ. 205 కోట్ల భూ సేకరణ భారం


రామగుండం, నిజామాబాద్‍, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టులకూ నో హెల్ప్‌

వరంగల్‍,  ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయంలో ఏపీపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న కేంద్రం.. తెలంగాణను మాత్రం ఎట్టికి వదిలేస్తోంది. తెలంగాణ మొత్తంలో హైదరాబాద్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్‌ ఉండగా.. ఇటీవలే వరంగల్‌లోని మామునూరు, రామగుండంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఏపీలో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి వందల కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణలోని ఎయిర్‌పోర్టులకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదు. పైగా భూసేకరణ ఖర్చును సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది.


*_ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టుకు రూ.1,570 కోట్లు_*


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు ఉండగా... కర్నూలు, కడప, పుట్టపర్తి, రాజమండ్రి దేశీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉడాన్‌ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


దీనికి సంబంధించి ఉంగుటూరు మండలంలో 1,123 ఎకరాల అటవీ భూములను గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ.. ఈ భూములను ఎయిర్‌పోర్ట్‌కు ఇవ్వాలంటే అందుకు రెట్టింపు భూములను కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దానికి అవసరమైన భూసేకరణ ఖర్చును సైతం తామే భరిస్తోంది. ఇందుకోసం మోదీ సర్కార్‍ ఏకంగా రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని అక్కడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మంగళవారం వెల్లడించారు.


*_మామునూరులో 253 ఎకరాలకు నో ఫండ్స్‌_*


తెలంగాణలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించేందుకు సుమారు 20 ఏండ్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల దూరం వరకు మరో ఎయిర్‌పోర్ట్‌ ఉండకూడదని జీఎంఆర్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. మరో వైపు 45 ఏండ్ల కిందే మామునూరు ఎయిర్‌పోర్టు మూతపడడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ పునఃప్రారంభానికి 949.14 ఎకరాలు అవసరం అవుతాయని తేల్చగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి.


మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ప్రభుత్వ భూములు పోను ఫైనల్‍గా 220 ఎకరాల సాగు భూమి, మరో 33 ఎకరాల వరకు ప్లాట్లతో కలిపి మొత్తం 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‍ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ క్లియర్‌ చేసింది. ఇదే టైంలో భూసేకరణ విషయంలో కేంద్రం మెలిక పెట్టింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరగాలంటే అందుకు అవసరమైన 253 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఎయిర్‍పోర్ట్‌ అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఈ)కు అప్పగించాలని చెప్పింది.


దీంతో భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్‍ 17న కాంగ్రెస్‍ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 220 ఎకరాలకు సంబంధించిన 309 మంది రైతులు, 61,134.5 గజాల కమర్షియల్‍ ప్లాట్లకు సంబంధించిన 50 మంది ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.205 కోట్లే కాకుండా మరో రూ.200 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది.


*_తెలంగాణపై కేంద్రం వివక్ష_*


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఎయిర్‍పోర్టుల నిర్మాణంపై వివక్షచూపుతోంది. విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్న కేంద్రం.. అందుకు అవసరమైన, భారీ బడ్జెట్‌తో కూడుకున్న భూసేకరణ ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే రుద్దుతోంది. ఏపీలో ఇప్పుడున్న ఏడు ఎయిర్‍పోర్టులను 14కు పెంచుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాడేపల్లిగూడెం విమానాశ్రయానికి అవసరమయ్యే భూసేకరణకు రూ.1,570 కోట్లు భరించిన కేంద్రం.. వినుగొండ, దగదర్తి, ఓర్వకల్లు, కుప్పంతో పాటు భోగాపురంలోనూ అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించేందుకు రెడీగా ఉంది.


కానీ తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత మామునూరులో నిర్మించబోయే ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల భూసేకరణకు నయా పైసా కేటాయించడం లేదు. అయితే ఏపీకి చెందిన ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు మోదీ మంత్రివర్గంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వల్లే ఆ రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులిస్తూ.. తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించి ఎయిర్‍పోర్ట్‌ భూ సేకరణ నిధుల విషయంతో పాటు నిజామాబాద్‍, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌లకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

 

  • మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
  • ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు
  • NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసిన కూతురు(16)
  • ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18)తో కలిసి హత్య చేసిన కన్న కూతురు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు

  • మహిళలు ఒంటరిగా ఇండియాకు వెళ్లొద్దు అంటూ అవమానిస్తూ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
  • ఉత్తర తెలంగాణ పేరు సైతం ప్రస్తావన
  • ఇండియాల రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
  • గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకూడదని.. ఆ దేశ ఉద్యోగులకు సూచన
  • భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ 
  • లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల 
  • నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన
  • భారతదేశంలో మానభంగాలు చాలా వేగంగా పెరుగుతున్న నేరంగా మారిందని.. కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి తెలిపిన అమెరికా
  • ఒంటరిగా ప్రయాణించకూడదని, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని స్పష్టం 
  • భారత్‌లో పని చేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసింది గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది
  • అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాలను చేర్చిన అమెరికా
  • జమ్మూ-కశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే ఫరవాలేదని, గ్రామీణ ప్రాంతాలకు వద్దని పేర్కొన్న అమెరికా

  • రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు మాత్రం రూ. 1.3 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం
  • ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులపై దృష్టిసారించిన హెచ్ఎండీఏ అధికారులు
  • ఇక్కడి కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున అసహనం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్దీం
  • తో దాదాపు రూ.1.3 కోట్ల వ్యయంతో ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్న అధికారులు
  • త్వరలో కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది.. దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్తవి వేయనున్న అధికారులు
  • ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు

 

  • ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం
  • చెన్నైలో జెప్టో యాప్‌లో ఆర్డర్‌ చేసిన మడిపాక్కంకు చెందిన ఐటీ ఉద్యోగిని
  • మహిళ ఆర్డర్‌ చేసిన వస్తువులను డెలివరీ చేసిన గోపినాథ్‌ అనే డెలివరీ బాయ్‌
  • సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ లేదని, కాసేపు చార్జింగ్‌ పెట్టాలని కోరడంతో డెలవరీబాయ్‌ని ఇంట్లోనికి అనుమతించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
  • ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేసిన గోపినాథ్యు
  • వతి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పరారైన డెలివరీ బాయ్‌
  • దీంతో పోలీసులను అశ్రయించిన బాధిత మహిళ
  • కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్‌ గోపీనాథ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

  • విజయ్ దేవరకొండ పై ఎఫ్ఐఆర్ నమోదు
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు
  • రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యల నైపథ్యంలో నమోదు
  • 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు అంటూ విజయ్ దేవరకొండ వివాదస్పద వ్యాఖ్యలు
  • గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.